
రాహుల్ గాంధీపై కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ఆగ్రహం
కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ తీరుపై కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్ ప్రవర్తన ప్రజాస్వామ్యానికి మచ్చ తెచ్చిందని, మహిళలను కించపరిచే విధంగా వ్యవహరించారని ఆయన విమర్శించారు. గతంలో సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్ వంటి నాయకులు ఇలా ప్రవర్తించలేదని రాజ్‌నాథ్ గుర్తు చేశారు. ప్రధాని మోదీ అధికారంలోకి వచ్చాక భారత్ ప్రతిష్ఠ పెరిగిందని ఆయన పేర్కొన్నారు.

































