
అత్యంత పొడవైన రన్-అప్తో సామ్ బోడోవానో గిన్నిస్ రికార్డు
ఇంగ్లండ్ క్లబ్ క్రికెటర్, అథ్లెట్ సామ్ బోడోవానో క్రికెట్ చరిత్రలోనే అత్యంత పొడవైన రన్-అప్తో తొలి బంతిని వేసి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ కోసం ప్రయత్నించాడు. రూత్ స్ట్రాస్ ఫౌండేషన్ కోసం 6వేల పౌండ్లు సేకరించడంలో భాగంగా, సామ్ లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్ నుంచి 14 గంటల్లో 100 కిమీ దూరం పరిగెత్తి బంతిని విసిరాడు. గతంలో టామ్ డున్ పేరిట ఉన్న 24 కిమీ రికార్డును సామ్ సవరించాడు.



































