
జనసేన కార్యకర్తలకు అండగా నిలుస్తాం: హరిప్రసాద్
AP: జనసేన పార్టీ కార్యకర్తలకు న్యాయపరమైన అండగా నిలిచేందుకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టనున్నట్లు ఏపీ శాసన మండలి విప్ పిడుగు హరిప్రసాద్ తెలిపారు. అమరావతిలో జరిగిన జనసేన న్యాయవాదుల సమీక్షా సమావేశంలో పాల్గొన్న ఆయన, జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌పై ఎవరైనా అనుచిత వ్యాఖ్యలు చేసినా, వ్యక్తిగతంగా దూషించినా వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకునేలా ఫిర్యాదులు చేయాలని న్యాయవాదులకు సూచించారు.



































