
TG: ఇవాళ పలుజిల్లాల్లో తేలికపాటి వర్షాలు.. ఎల్లో అలర్ట్ జారీ
తెలంగాణలోని పలు జిల్లాల్లో శుక్రవారం నాడు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ముఖ్యంగా హైదరాబాద్, రంగారెడ్డి, వరంగల్, ఖమ్మం, నల్గొండ, మహబూబ్నగర్ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఎల్లో అలర్ట్ జారీ చేసింది. అలాగే ఏపీలోని అల్లూరి, పోలవరం, ఎన్టీఆర్, నంద్యాల, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) పేర్కొంది.



































