
మస్కట్ నుంచి స్వదేశానికి చేరుకున్న కొడంగల్ మహిళ
TG: ఉపాధి కోసం వెళ్లి మోసపోయి మస్కట్‌లో చిక్కుకున్న తుప్పుడు లక్ష్మి అనే మహిళ బీఆర్ఎస్ నేత కేటీఆర్ చొరవతో స్వదేశానికి చేరుకుంది. కొడంగల్‌కు చెందిన తుప్పుడు లక్ష్మి మస్కట్‌లో పడుతున్న బాధలను చూసి సెప్టెంబర్ 29న ఆమె కుమారుడు రాజు కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లాడు. సమస్యను పరిష్కరించి, సురక్షితంగా ఆమెను స్వదేశానికి తీసుకొస్తానని కేటీఆర్ భరోసా ఇచ్చారు. ఆ మేరకు ఎంబసీ అధికారులతో మాట్లాడి సురక్షితంగా వెనక్కి రప్పించారు. హైదరాబాదులోని తెలంగాణ భవన్లో KTRని కలిసిన లక్ష్మి ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.



































