
డీఎస్సీపై చర్చకు సిద్ధం: వైసీపీకి మంత్రి లోకేష్ సవాల్
AP: డీఎస్సీలో అక్రమాలు జరుగుతున్నాయని వైసీపీ చేస్తున్న ఆరోపణలపై అసెంబ్లీలో మంత్రి లోకేశ్ తీవ్రంగా స్పందించారు. అసెంబ్లీలో చర్చకు రావాలని వైసీపీని ఆహ్వానించిన మంత్రి, వారు తప్పించుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. డీఎస్సీని పారదర్శకంగా నిర్వహించి 16 వేల మందికి ఉద్యోగాలు ఇచ్చామని, వారంతా తమ వెంటే ఉన్నారని తెలిపారు. మరో నాలుగు డీఎస్సీ నోటిఫికేషన్లు విడుదల చేస్తామని, కుంభకోణాలు జగన్ కుటుంబానికి పేటెంట్ అని విమర్శించారు. ఈ ఏడాది లక్షా 10 వేల మంది పిల్లలు ప్రైవేట్ నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో చేరారని, ప్రభుత్వ పాఠశాలలు అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దుతున్నామని పేర్కొన్నారు.



































