
కలలో మురికి బట్టలు.. శుభమా? అశుభమా?
స్వప్న శాస్త్రం ప్రకారం.. నిద్రలో వచ్చే కలలకు ప్రత్యేక సంకేతార్థాలుంటాయి. కలలో మురికి లేదా చిరిగిన బట్టలు ధరించినట్లు కనిపిస్తే, అది వ్యక్తిగత ప్రతిష్టకు భంగం, సన్నిహితుల వల్ల మనస్తాపం, ఆర్థిక నష్టాలు లేదా చేపట్టిన పనులు ఆశించిన ఫలితాలు ఇవ్వకపోవడాన్ని సూచిస్తుందని నమ్ముతారు. అయితే, కలలో మురికి బట్టలు ఉతుకుతున్నట్లు కనిపిస్తే, అది సమస్యలు, ఒత్తిళ్లు తొలగిపోయి, కొత్త అవకాశాలు, మానసిక ప్రశాంతత లభించే శుభసూచకంగా పరిగణించబడుతుంది. వేరొకరు మురికి బట్టల్లో కనిపిస్తే, చుట్టూ ఉన్న వ్యక్తుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచిస్తుంది.



































