
ఆగస్టు నుండి పెరగనున్న వస్తువుల ధరలు.. సామాన్యులపై భారం
అంతర్జాతీయ ఉద్రిక్తతలు, సరఫరా వ్యవస్థలో అంతరాయం, ముడిసరుకుల రవాణా ఖర్చులు పెరగడం వంటి కారణాలతో ఆగస్టు నెల నుండి పలు వస్తువుల ధరలు పెరగనున్నాయి. ప్యాక్ చేసిన టీ, హెయిర్ ఆయిల్ ధరలు 6% నుండి 8% వరకు, బ్రాండెడ్ దుస్తుల ధరలు 8% వరకు ప్రియం కానున్నాయి. టీవీలు, ఫ్రిజ్ ధరలు 4%-6% వరకు, వాషింగ్ మెషీన్లు 10% వరకు, స్మార్ట్ఫోన్లతో పాటు మారుతి, హోండా వంటి కంపెనీల కార్ల ధరలు రూ. 30,000 వరకు పెరిగే అవకాశం ఉంది. ఈ ధరల పెరుగుదల సామాన్యులపై తీవ్ర భారం మోపనుంది.


































