
పేదల ఉన్నత విద్యకు PM-విద్యాలక్ష్మి పథకం
ఉన్నత విద్యను అభ్యసించాలనే ఆశ ఉన్నప్పటికీ ఆర్థిక ఇబ్బందుల కారణంగా చాలామంది విద్యార్థులు వెనుకడుగు వేస్తుంటారు. ప్రతిభ ఉన్న విద్యార్థులు డబ్బు సమస్యల కారణంగా చదువును ఆపకుండా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం PM-విద్యాలక్ష్మి పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం ద్వారా విద్యార్థులు గుర్తింపు పొందిన ఉన్నత విద్యా సంస్థల్లో ప్రవేశం పొందిన తర్వాత, వివిధ బ్యాంకుల విద్యా రుణ పథకాలను ఒకే పోర్టల్ ద్వారా తెలుసుకుని, తమకు అనుకూలమైన రుణానికి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.

































