ట్రెండింగ్ - Telugu Trending

రష్యా: కత్తితో దాడికి దిగిన 15 ఏళ్ల యువకుడు, నలుగురు భారతీయులకు గాయాలు

రష్యా: కత్తితో దాడికి దిగిన 15 ఏళ్ల యువకుడు, నలుగురు భారతీయులకు గాయాలు

రష్యాలోని ఉఫా మెడికల్‌ కాలేజ్‌ హాస్టల్‌లో 15 ఏళ్ల టీనేజర్ కత్తితో విదేశీ విద్యార్థులపై దాడి చేశాడు. ఈ ఘటనలో నలుగురు భారతీయ విద్యార్థులకు గాయాలయ్యాయి. నిందితుడు బాధితుల రక్తంతో గోడలపై 'స్వస్తిక్' చిహ్నాలను గీసినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకునే క్రమంలో ఇద్దరు అధికారులను గాయపరిచి, ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. నిందితుడు నిషేధిత నియో-నాజీ సంస్థకు చెందినవాడని సమాచారం. మాస్కోలోని భారత రాయబార కార్యాలయం ఆవేదన వ్యక్తం చేస్తూ, గాయపడిన విద్యార్థులకు మెరుగైన చికిత్స అందిస్తున్నట్లు తెలిపింది. గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది.