Top 10 viral news 🔥

#తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు
ఏపీ ప్రజలకు అలెర్ట్.. వచ్చే 3 రోజులు వానలే వానలు
AP: నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో వచ్చే మూడు రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉత్తర కోస్తా జిల్లాల్లో మొదటి రెండు రోజుల్లో పొగమంచు, తేలికపాటి వర్షాలు పడతాయని, సోమవారం కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. దక్షిణ కోస్తా జిల్లాల్లో మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయంది. రాయలసీమ ఆకాశం మేఘావృతం కాగా, కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు పడతాయని పేర్కొంది.































